రెండవ రోజు మహానాయకుడు వసూళ్లు !

రెండవ రోజు మహానాయకుడు వసూళ్లు !

 

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బాలకృష్ణ, క్రిష్ కలిసి చేసిన 'ఎన్టీఆర్' బయోపిక్ రెండవ  భాగం  'మహానాయకుడు'.  గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అన్ని అంచనాల్ని తలకిందులు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో 1.6 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది.  ఇక రెండవ రోజు శనివారమైనా  పుంజుకుంటుందేమో అనుకుంటే మరింత డల్ అయింది.  ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు 2వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి 52 లక్షల షేర్ మాత్రమే అందుకుని మొత్తంగా రెండు రోజులకు కలిపి 2.14 కోట్లతో సరిపెట్టుకుంది.   మరి ఈరోజు ఆదివారమైనా కలెక్షన్స్ మెరుగుపడతాయేమో చూడాలి.