'డిస్కో రాజా' ప్రాబ్లమ్ తీరిపోయింది !

'డిస్కో రాజా' ప్రాబ్లమ్ తీరిపోయింది !

వరుస పరాజయాల్లో ఉన్న రవితేజ 'డిస్కో రాజా' సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే.  విఐ  ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు.  ఇదివరకే మొదలుకావాల్సిన ఈ సినిమా ఇప్పటికే ఆలస్యమైంది.  ఎట్టకేలకు అన్ని పనుల్ని ముగించుకున్న టీమ్ చిత్రీకరణకు సిద్ధమైంది.  ఈరోజు పూర్వజా కార్యక్రమాలు నిర్వహించారు.  రేపటి నుండే రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.  రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ ఫుత్, నాభ నటేష్ కథానాయికలుగా నటించనున్నారు.