మహేష్ బాబు గెటప్ పై కొత్త చర్చ

మహేష్ బాబు గెటప్ పై కొత్త చర్చ

మహేష్ 26 వ సినిమా నిన్న లాంఛనంగా ప్రారంభమైంది.  జూన్ 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమౌతుంది.  ఈ విషయం అందరికి తెలిసిందే.  ఇందులో మహేష్ బాబు మిలిటరీ ఆర్మీ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. ఆర్మీ ఆఫీసర్ అనగానే మన కళ్ళముందు ఓ రూపం కనిపిస్తుంది.  హైట్ దానికి తగ్గట్టుగా వెయిట్, ముఖంపై కొనదేలిన మీసం కనిపిస్తాయి.  దాదాపుగా ఆర్మీ ఆఫీసర్లు ఇలాగే కనిపిస్తుంటారు.  

మీసాలు రోషానికి ప్రతిరూపం.  రీ ట్రీట్ సమయంలో ఇండియా పాక్ బోర్డర్లో జరిగే పరేడ్ లో మీసాలే హైలైట్ గా నిలుస్తుంటాయి.  ఇప్పుడు మహేష్ మీసం గురించే అందరిలోను చర్చ జరుగుతున్నది.  మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా మీసం పెట్టుకొని కనిపిస్తాడా లేదంటే క్లీన్ షేవ్ తోనే కనిపిస్తాడా అన్నది తెలియాలి.  ఇప్పటి హీరోలు చాలామంది మీసాలు లేకుండానే కనిపిస్తున్నారు కదా.