ప్రత్యేక హోదాపై ప్రధానిని ఒప్పించాలని కోరా...

ప్రత్యేక హోదాపై ప్రధానిని ఒప్పించాలని కోరా...

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ఆయన చర్చించారు. భేటీ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకరించాలని కోరాం. విభజన హామీల అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాం. ప్రత్యేక హోదా అంశంపై కూడా అమిత్ షాతో చర్చించాం. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవశ్యకతపై కేంద్ర హోంమంత్రికి వివరించాం. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై వస్తున్న వార్తలు వదంతులే. డిప్యూటీ స్పీకర్ పై మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.