మా ఆయన్ను చంపినట్టే నన్నుకూడా చంపేయండి.. చెన్నకేశవులు భార్య 

మా ఆయన్ను చంపినట్టే నన్నుకూడా చంపేయండి.. చెన్నకేశవులు భార్య 

దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.  కేసులో రికన్ స్ట్రక్షన్ చేసేందుకు నిందితులను చటాన్ పల్లికి తీసుకెళ్లి అక్కడ విచారణ చేస్తున్న సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించగా నిందితులను ఎన్ కౌంటర్ చేశారు.  దీనిపై దేశంలోని ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

అయితే, ఎన్ కౌంటర్ పై ఏ4 నిందితుడు చెన్నకేశవులు భార్య లక్ష్మి స్పందించింది.  తన భర్త తప్పు చేశాడని పోలీసులు, కోర్టు నమ్మితే దానికి తగిన శిక్ష విధిస్తే బాగుండేదని, కానీ ఇలా ఎన్ కౌంటర్ చేయడం మంచిది కాదని ఆమె ఆవేదన చెందింది.  తన భర్తను చంపినట్టే తనను కూడా చంపాలని అంటోంది.