దిశ కేసు : మత్తులో ఉన్నాం...ఏమి చేస్తున్నామో సోయి లేదు

దిశ కేసు : మత్తులో ఉన్నాం...ఏమి చేస్తున్నామో సోయి లేదు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలు దిశ హత్యాచార ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో పూర్తిగా మద్యం మత్తులో ఉన్నామని, ఏం చేస్తున్నామో సోయిలేని స్థితిలో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో నిందితులు వెల్లడించారని చెబుతున్నారు. ఉదయం నుంచి లారీలో కూర్చుని, కూర్చుని విసుగు పుట్టిందని ఒంటరిగా యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలని అనిపించిందని నిందితులు పేర్కొన్నారు. ఆమె ఎంత ఆలస్యంగా వస్తే తమ పని అంత సులభమవుతుందని నిందితులు భావించగా రాత్రి 9 గంటల తర్వాతే దిశ రావడంతో హడావుడిగా లారీలో నుంచి కిందకు దిగారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని మద్యం తాగుతూ నిర్ణయించుకున్నారు. ఆమెను చంపేసి కాల్చేస్తే ఎవరూ గుర్తు పట్టరని అనుకున్నారట. అయితే ఇంత దూరం వస్తదనుకోలేదని చెప్పడంతో పోలీసులే కంగుతిన్న పటిస్థితి.