ఏపీలో తొలిసారి దిశ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ అధికారి పై కేసు

ఏపీలో తొలిసారి దిశ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ అధికారి పై కేసు

అనంతపురం వ్యవసాయ శాఖ జెడి  హాబీబ్ భాష పై నిర్భయ కేసు నమోదయింది. మహిళా ఉద్యోగిని సల్మా ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు విచారణకు ఆదేశించారు. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరించిన ఆరోపణలపై వ్యవసాయ శాఖ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. మహిళా ఉద్యోగినులను విచారించిన క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీనివాసులు వాంగ్మూలం నమోదు చేశారు. అలానే కార్యాలయంలో సీసీ ఫుటేజీని పరిశీలించారు.

ఇక ప్రస్తుతానికి జేడీ పరారీలో ఉన్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హాబీబ్ బాషాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. అయితే ఇలా దిశ పోలీసు స్టేషన్లో ప్రభుత్వ అధికారి పై కేసు నమోదు కావడం ఇదే మొదటి సారి అని అంటున్నారు. నిన్న జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషాని సస్పెండ్ చేశారు. గతంలో గుంటూరు జిల్లాలో డీఆర్‌డీఏ పీడీగా పని చేస్తున్న సమయంలోనూ మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి.