ఊపందుకున్న దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ మీద విచారణ

ఊపందుకున్న దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ మీద విచారణ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన విచారణ కమీషన్ హైదరాబాద్‌కు చేరుకుంది. హై కోర్టు ప్రాంగణం నుంచి ఈ కమీషన్‌ కార్యకలాపాలు నిర్వహించనుంది. ఇప్పటికే కేసు డైరీలను తేప్పించుకుంది కమీషన్‌. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపేందుకు గతంలో సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో ప్రతేక జ్యుడీషియల్‌ కమీషన్‌ ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జితో పాటు, ఓ న్యాయవాది, సిబిఐ మాజీ డైరెక్టర్ ఈ కమీషన్‌లో సభ్యులుగా ఉన్నారు. జ్యుడీషియల్ కమిటీలో మాజీ న్యాయమూర్తి సిర్పూర్ కర్, సీబీఐ మాజీ డైరెక్టర్ కారికేయన్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖ ప్రకాష్ ఉన్నారు. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కమిటీ వేసింది. హైకోర్టు c బ్లాక్ లో కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసింది. నిందితుల పోస్టుమార్టం రిపోర్ట్.. రీ పోస్టుమార్టం రీపోర్ట్ ను జ్యుడీషియల్ కమిటీ పరిశీలించనున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుండి కూడా కమిటీ సభ్యులు వివరాలు సేకరించనున్నారు. ఇక ఆ కమిటీ సభ్యులకి సీఆర్పీఎఫ్ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం.