బిగ్ బ్రేకింగ్:  దిశ నిందితుల ఎన్ కౌంటర్... 

బిగ్ బ్రేకింగ్:  దిశ నిందితుల ఎన్ కౌంటర్... 

నవంబర్ 27 వ తేదీన తోడుంపల్లి వద్ద దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు.  నిందితులను పట్టుకొని కోర్టుకు అప్పగించగా కోర్టు వారిని 14 రోజులపాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  అయితే, ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిందితులను వెంటనే ఉరి తీయాలని, లేదంటే ఎన్ కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ఉద్యమం  చేశారు.  

అయితే, పోలీసులు చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని అన్నారు. కాగా, షాద్ నగర్ కోర్టు నుంచి పోలీసులు తమ కష్టడికి తీసుకున్నాక, పోలీసులు చటాన్ పల్లి వద్ద సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు.  ఈ సమయంలో పోలీసులు వేరే దారి లేక వారిని కాల్చి చంపినట్టు పోలీసులు చెప్తున్నారు.