తెలంగాణ పోలీస్ అకాడమీకి దిశ తల్లిదండ్రులు 

తెలంగాణ పోలీస్ అకాడమీకి దిశ తల్లిదండ్రులు 

దిశపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన నిందితులు ఈనెల 6 వ తేదీన పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ అయ్యారు.  ఎన్ కౌంటర్ చేసిన తరువాత నలుగురు నిందితులను జకిలేరులో ఆరోజు సాయంత్రమే ఖననం చేయాలని పోలీసులు అనుకున్నారు.  ఆ దిశగానే చర్యలు చేపట్టారు. అయితే, ఖననం విషయంలో హైకోర్టు అడ్డు చెప్పింది.  వారి మృతదేహాలను 9 వ తేదీ వరకు భద్రపరచాలని చెప్పింది.  

అఖిలభారత మహిళ సంగం ఈ ఎన్ కౌంటర్ పై అభ్యంతరం తెలిపింది.  హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.  ఇక జాతీయ మానవ హక్కుల సంఘం దీనిపై సీరియస్ కాకుండా... ఈ కేసును పరిశీలించేందుకు 7 సభ్యుల ఎన్.హెచ్.ఆర్సి బృందం దర్యాప్తు చేస్తున్నది.  ఇప్పటికే నిందితుల తల్లిదండ్రులను జాతీయ మానవ హక్కుల సంఘం విచారించింది.  వారి వద్ద నుంచి స్టేట్మెంట్ తీసుకుంది.  మరోవైపు దిశ తల్లిదండ్రుల స్టేట్మెంట్ ను కూడా తీసుకోబోతున్నది.  దిశ తండ్రి, ఆమె చెల్లి ఇద్దరినీ తెలంగాణ పోలీస్ అకాడమీకి పిలిపించారు.  వీరి స్టేట్మెంట్ ను అధికారికంగా రికార్డ్ చేయబోతున్నారు.  దిశ తల్లిదండ్రులను ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.