ట్వంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ ఇక డిస్నీ పరం

ట్వంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ ఇక డిస్నీ పరం

వాల్ట్ డిస్నీ కంపెనీ బుధవారం ట్వంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ ఇంక్ కి చెందిన ఫిలిమ్, టెలివిజన్ ఆస్తులను 71 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దీంతో నెట్ ఫ్లిక్స్ ఇంక్ ను ఎదుర్కొనేందుకు సొంత స్ట్రీమింగ్ సర్వీస్ తో వస్తున్న డిస్నీకి జనాదరణ పొందిన కంటెంట్ పరిధి లభించినట్టయింది.

ఈ ఒప్పందం డిస్నీ పోర్ట్ ఫోలియోని మరింత విస్తృతం చేయనుంది. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని పాత్రలైన మిక్కీ మౌస్, ల్యూక్ స్కైవాకర్, మార్వెల్ సూపర్ హీరోలను, ఫాక్స్ కి చెందిన ఎక్స్-మెన్, అవతార్, ది సింప్సన్స్ ఫ్రాంచైజీలతో కలపనుంది.

ఈఎస్పీఎన్, ఇతర కేబుల్ నెట్ వర్క్ ల నుంచి కోల్పోతున్న సబ్ స్క్రైబర్ల నష్టాన్ని త్వరలో ప్రారంభించనున్న స్ట్రీమింగ్ సర్వీస్, డిస్నీ+ ద్వారా పూరించాలని డిస్నీ లక్ష్యంగా పెట్టుకుంది. 

కేబుల్ కంపెనీ కామ్ కాస్ట్ కార్ప్ ఆస్తుల కొనుగోలు చేయడానికి జరిగిన బిడ్డింగ్ యుద్ధంలో నెగ్గిన దాదాపు ఏడాది తర్వాత డిస్నీ మరోసారి ఫాక్స్ డీల్ పూర్తి చేయగలిగింది.

మంగళవారం నాడు ఫాక్స్ కార్ప్ ప్రత్యేకంగా నాస్ డాక్ లో రంగప్రవేశం చేసింది. తన బోర్డులో సభ్యులుగా అమెరికా మాజీ హౌస్ స్పీకర్ పాల్ ర్యాన్, ఫార్ములా వన్ గ్రూప్ సీఈవో చేజ్ కేరీ, మరో ఇద్దరిని నియమించింది. 

కొత్తగా ఏర్పడిన మీడియా కంపెనీకి ఫాక్స్ న్యూస్ ఛానెల్, ఫాక్స్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్ ల ఆస్తులు చెందుతాయి. ఇది సుమారు 10 బిలియన్ డాలర్ల వార్షికాదాయం సాధిస్తుందని భావిస్తున్నారు.