ఆ "ల్యాండ్"లో ఇక మందుకు ఓకే

ఆ "ల్యాండ్"లో ఇక మందుకు ఓకే

ప్రపంచ ప్రఖ్యాత థీమ్ పార్క్ డిస్నీ ల్యాండ్.. తన ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది. 2019 వేసవి నుంచి డిస్నీల్యాండ్ లో ఆల్కహాల్ ను అనుమతిస్తున్నట్టు దాని ప్రొప్రైటర్ ఓగా గారా ప్రకటించారు. 

63 ఏళ్లుగా డిస్నీల్యాండ్.. ప్రపంచ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతా ఫ్యామిలీ ఎంటర్ టెయిన్ మెంట్ లాగా ఉండాలే తప్ప ఎలాంటి అసభ్యకరమైన, అసాంఘికమైన కృత్యాలకు అవకాశం లేకుండా ఉండాలని దాని స్థాపకుడు వాల్ట్ డిస్నీ కలలు గని నిర్మించిన అపురూపమైన థీమ్ పార్క్. అలాంటి థీమ్ పార్క్ లో ఇక నుంచి బీర్, వైన్, లిక్కర్ వంటివి యథేచ్ఛగా సర్వ్ చేస్తామని అందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని యాజమాన్యం చెబుతోంది. కాక్ టెయిల్ లో కూడా ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ వెరైటీస్ అందుబాటులో ఉంచుతామని చెబుతున్నారు. 

అలసిన సాయంత్రాలను అందంగా, అద్భుతంగా ఎంజాయ్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, తాము సర్వ్ చేసే ఫుడ్ వెరైటీలు కూడా  గతంలో ఎప్పుడూ రుచి చూడని పదార్థాలుగా ఉంటాయంటున్నారు. అంతేకాదు.. ఫుడ్ సర్వ్ చేసే డిష్ లు కూడా ప్రత్యేకంగా తయారు చేయించామని చెబుతున్నారు. ఇక ఎంటర్ టెయిన్ మెంట్ ప్రోగ్రామ్స్ సంగతి సరేసరి. దీంతో స్టార్ వార్స్ క్యాంటినాలో 21 ఏళ్లు పైబడ్డ ఎవరైనా విందారగిస్తూ బిజినెస్ గానీ, డీలింగ్స్ గానీ, డేటింగ్స్ గానీ... ఎలాంటి వ్యవహారాలైనా మాట్లాడుకోవచ్చన్నమాట.