కాలువలోకి దూసుకెళ్లిన దివాకర్ ట్రావెల్స్ బస్సు..

కాలువలోకి దూసుకెళ్లిన దివాకర్ ట్రావెల్స్ బస్సు..

కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ వద్ద కాలువలోకి దూసుకెళ్లింది దివాకర్ ట్రావెల్స్ బస్సు.. ఏపీ 02 టీఈ 5652 నెంబర్ గల దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు కాల్వలోకి దూసుకెళ్లగా.. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌తో సహా మొత్తం 18 మంది ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నారు.. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.. అంతా సురక్షితంగా బయటపడగా.. మరో బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం.