బిగ్ పార్టీ ఇచ్చిన డీజే బ్యూటీ

బిగ్ పార్టీ ఇచ్చిన డీజే బ్యూటీ

టాలీవుడ్‌లో వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ వేడి పెంచుతోంది ముంబై బ్యూటీ పూజా హెగ్డే. గోవా బ్యూటీ ఇలియానా త‌ర‌వాత మ‌ళ్లీ ఆ రేంజులో టాలీవుడ్‌పై ప్ర‌భావం చూపుతున్న నాయిక‌గా పూజా పేరు మార్మోగిపోతోంది. ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్‌పై మ‌ల్లూ భామ‌ల దండ‌యాత్ర సాగుతున్న వేళ‌.. పూజా హెగ్డే ఆ ఒర‌వ‌డికి బ్రేక్ వేయ‌గ‌లుగుతోంది. అయితే ఈ అమ్మ‌డికి అంత సీనెలా వ‌చ్చింది? అని ప్ర‌శ్నిస్తే .. అదంతా `డీజే` మ‌హ‌త్యం అని చెప్పాలి. ఈ సినిమాలో పూజా రెండు నిమిషాల స్విమ్మింగ్ పూల్ స‌న్నివేశంతో అగ్గి రాజేసింది. బికినీలో మంట‌లు పుట్టించింది. ఆ త‌ర‌వాత వ‌రుస‌గా నాలుగు తెలుగు సినిమాల‌కు సంత‌కాలు చేసింది. 

ఇప్ప‌టికిప్పుడు ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, మ‌హేష్‌ల‌తో సినిమాలు చేస్తోంది. అదంతా అటుంచితే.. ఇదిగో ఇలా స‌డెన్‌గా డీజే టీమ్ ఓచోట రీయునైట్ అవ్వ‌డంపై టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ ఫోటోని పూజా స్వ‌యంగా ట్వీట్ చేస్తూ.. ఏడాది త‌ర‌వాత అనుకోకుండా ఇలా క‌లిశాం. మాతో పాటు న‌వ్వులు పంచుకుంటారా? అంటూ కామెంట్‌ని పోస్ట్ చేసింది. స‌మ‌యం.. సంద‌ర్భం అలా క‌లిసొచ్చాయి స‌రే... సేమ్ కాంబినేష‌న్ మ‌రో సినిమాతో రీయునైట్ అవుతోందా? అన్న‌ది మాత్రం తేలాల్సి ఉందింకా. ఇక‌పోతే ఈ ఫోటో చూస్తుంటే ఏదైనా డీజే పార్టీలో ఇలా డీజే టీమ్ క‌లిసిందా? అన్న సందేహాలొస్తున్నాయ్‌!