స్విస్ స్టార్‌ చేజారిన 'వింబుల్డన్‌'

స్విస్ స్టార్‌ చేజారిన 'వింబుల్డన్‌'

వింబుల్డన్‌లో అసలు సిసలు ఫైనల్‌ అంటే ఇదే అనేలా జకోవిచ్‌-ఫెదరర్‌ పోరాడారు. నువ్వానేనా అనేలా ఈ సమఉజ్జీలు.. 4 గంటల 57 నిమిషాలపాటు కప్‌ కోసం పోరాడారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన వింబుల్డన్‌ ఫైనల్స్‌లో స్విస్‌ దిగ్గజం ఫెదరర్‌ను నివాక్‌ జొకోవిచ్‌ ఓడించి కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 7-6(5), 1-6, 7-6(4), 4-6, 13-12(3)తో ఫెదరర్‌పై నెగ్గాడు. టైబ్రేక్‌లో 7-3తో పైచేయి సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.