వింబుల్డన్‌ విజేత జకోవిచ్‌

వింబుల్డన్‌ విజేత జకోవిచ్‌

ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ 2018 పరుషుల సింగిల్స్‌ టైటిల్‌ను సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. ఇవాళ జరిగిన ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్‌ ఆండర్సన్‌పై 6-2, 6-2, 7-6 తేడాతో విజయం సాధించాడు. కెరీర్‌లో జకోవిచ్‌కు ఇది నాలుగో వింబుల్డన్‌ టైటిల్‌ కావడం విశేషం.
 తొలిరౌండ్ నుంచే ప్రత్యర్థులపై ఆదిపత్యం చెలాయిస్తూ ఫైనల్‌కు చేరుకున్న జకోవిచ్‌.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. మొదటి సెట్‌ నుంచి దూకుడు ప్రదర్శించాడు. రెండు సెట్లను సునాయాశంగా గెలుచుకున్నప్పటికీ మూడో సెట్‌లో ఆండర్సన్‌ గట్టి పోటీ ఇచ్చాడు. చివరికి.. టై బ్రేకర్‌లో గెలిచిన జకోవిచ్‌.. మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.