అమెరికాలో చదివిన వ్యక్తి భాష అదేనా..?

అమెరికాలో చదివిన వ్యక్తి భాష అదేనా..?

ఓల్డ్ సిటీ అభివృద్ధి కావాలంటే బీజేపీ కి ఓటు వెయ్యండని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ కోరారు. కేసీఆర్ తెలంగాణ నీ జాగిరా.. కేసీఆర్ నువ్వు 8వ నిజామా అని ఆమె ప్రశ్నించారు. దుబ్బాక గుణపాఠం షాక్ లో కేసీఆర్ ఉన్నాడని ఇవాల్టి కేసీఆర్ ప్రసంగం లో ఓటమి భయం కనిపిస్తుందని అన్నారు. ఈ ఎన్నికలు రాగానే హామీలతో కేసీఆర్ మోసం చేస్తున్నాడన్న ఆమె వర్షం పడితే...కార్లు పడవలు అవుతున్నాయని అన్నారు. సంస్కారం లేని వ్యక్తి కేటీఆర్ అని పేర్కొన్న ఆమె అమెరికాలో చదివిన వ్యక్తి భాష అదేనా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చారు... అయిన అభివృద్ధి లేదని ఆమె అన్నారు. పక్క రాష్ట్రం ఏపీ లో 30 లక్షల ఇల్లు కట్టాలని తెలంగాణలో ఒక్క ఇల్లు గతిలేదని అన్నారు. హిందువులు ముస్లింల మధ్య వివాదాలు సృష్టిస్తుంది ఎంఐఎం కెసిఆర్ అని ఆమె అన్నారు.