సీఎం చంద్రబాబుతో డీఎంకే నేత కీలక భేటీ

సీఎం చంద్రబాబుతో డీఎంకే నేత కీలక భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో డీఎంకే పార్టీకి చెందిన కీలక నేత భేటీ అయ్యారు. సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో సమావేశం అయిన తరువాత ఆపార్టీకి చెందిన దొరై మురుగన్ అమరావతి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్టాలిన్, కేసీఆర్ భేటీ వివరాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ ప్రాధాన్యత, జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చించారు. కేంద్రంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని బలంగా నమ్ముతున్న కేసీఆర్.. ప్రాంతీయ పార్టీలన్ని ఒకే జట్టుగా ఉండేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్‌ను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారు.