షాకిస్తున్న ప్రభాస్ సెట్స్ కాస్ట్... 

షాకిస్తున్న ప్రభాస్ సెట్స్ కాస్ట్... 

ప్రభాస్ హీరోగా చేస్తున్న జాన్ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్నది.  ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్స్ లో షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ షూటింగ్ కోసం ప్రత్యేకమైన సెట్స్ వేశారు.  ఈ సెట్స్ లో షూటింగ్ చేస్తున్నారు.  అయితే, ఈ సినిమా కోసం వేసిన సెట్స్ ఖరీదు ఎంతో తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు.  ఈ సెట్స్ కోసం ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.  

వింటేజ్ సెట్స్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.  1970 కాలానికి సంబంధించిన సినిమా కావడంతో కథకు తగ్గట్టుగా సెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.  హైదరాబాద్ షూటింగ్ అనంతరం ఆస్ట్రియాకు వెళ్ళబోతున్నారు.  ఆస్ట్రియాలో షూటింగ్ చేయబోతున్నారు.  పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.