ఈ ఫొటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా..?

ఈ ఫొటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా..?

ముఖానికి రంగు వేసుకుంటే ఎవరైనా సరే కొత్తగా మారిపోవాల్సిందే.  ఒరిజినల్ గా ఉన్న ఒక వ్యక్తిని మేకప్ మహిమతో మరొకలా మార్చేయవచ్చు.  మేకప్ మాయాజాలంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మ్యాజిక్ లు చేస్తుంటారు.  ఇప్పుడు అదే బాటలో మనవాళ్ళు కూడా నడుస్తున్నారు.  ఒక వ్యక్తిని ఎవరిలాగైనా మార్చేయవచ్చు.  అంతెందుకు.. మగవాళ్ళను ఆడవాళ్ళుగా కూడా మార్చేయవచ్చు. భామనే సత్యభామనే సినిమాలో కమల్ హాసన్, మేడమ్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, చిత్రం భళారే విచిత్రం సినిమాలో నరేష్, ఇటీవలే వచ్చిన చాలా సినిమాల్లో ఆలీ తదితరులు ఆడ వేషంతో మెప్పించిన సంగతి తెల్సిందే.  ఇప్పుడు కోలీవుడ్ లో ఓ క్రేజీ హీరో లేడీ గెటప్ లో అదరగొడుతున్నాడు.  ఆయన ఎవరో తెలుసా.. శివ కార్తికేయన్. రెమో సినిమాలో లేడీ గెటప్ లో నడుస్తున్నాడు.  మేకప్ తరువాత ఈ యువ హీరో అచ్చంగా లేడీలా కనిపించడం విశేషం.  ఎవరైనా సడెన్ గా చూస్తే శివకార్తికేయన్ ను లేడీ అనే అనుకోవడం గ్యారెంటీ.  కావాలంటే మీరు ఓ లుక్కేయండి.