ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? 

ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? 

టాలీవుడ్ లో మల్టీటాలెంటెడ్ నటులు చాలామంది ఉన్నాడు.  స్టార్ కిడ్ గా వెండితెరకు పరిచయమయ్యి, ఆ తరువాత  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బహుముఖ పాత్రలు చేసి మెప్పించిన నటుడు రానా దగ్గుబాటి.  ఈ నటుడు కేవలం తెలుగు వరకే ఆగిపోకుండా తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో వరసగా నటిస్తున్నారు.  

ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ టాలీవుడ్ నటుడు ఇప్పుడు హాతి మేరీ సాతి పేరుతో సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాలో రానా రాతియుగం మనిషిగా కనిపిస్తున్నారు.  రానా వేషధారణ, హావభావాలు చూస్తుంటే అలానే ఉన్నాడు.  దీనికి సంబంధించిన పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ ఏప్రిల్ 2, 2020 న రిలీజ్ కాబోతున్నది.  సడెన్ గా ఈ సినిమా పోస్టర్ చూస్తే... ఎవరు అనే డౌట్ వస్తుంది.  కాసేపు పరిశీలనగా చూస్తేనేగాని ఎవరనేది పోల్చుకోలేము.  కావాలంటే మీరు ఓ లుక్కెయ్యండి.