ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? 

ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? 

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ సంచలనం... చేసింది తక్కువ సినిమాలో.. మొదటి సినిమాతో మంచి విజయం అందుకుంది.  ఇక రెండో సినిమా మరో సంచలనంగా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.  రెండు సినిమాలు వరస హిట్స్ కావడంతో ఆమెకు ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది.  ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ టాప్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ లభించింది.  ఆమె ఎవరో గుర్తుకు వచ్చిందా.. 

ఇంకెవరు రష్మిక మందన్న.. ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యి.. గీతగోవిందం సినిమాతో ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ భామ ఇప్పుడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నది.  ఈ సినిమా హిట్టయితే.. రష్మిక టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.  ఇటీవలే బెంగళూరు సిటీలో అపార్ట్మెంట్ టాప్ లో నిలబడి ఉన్న ఫొటను తన ట్విట్టర్ పేజీ లో పోస్ట్ చేసింది.   వెనక్కి తిరిగి ఉండటంతో.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం అని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.