ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? 

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? 

ఆమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే.  తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది.  రెండో సినిమాతో భారీ హిట్ అందుకోవడమే కాకుండా.. చాలామంది హీరోయిన్లు ఎదురుచూసే వందకోట్ల రూపాయల క్లబ్ సినిమాలో నటించి మెప్పించింది.  తనదైన నటనతో మెప్పించింది ఈ హీరోయిన్.  ప్రస్తుతం మహేష్, అల్లు అర్జున్ వంటి బడా హీరోలతో సినిమాలు చేస్తోంది.  

ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఎవరో అని.. ఇంకెవరు.. రష్మిక.  కన్నడ భామ రష్మికకు తెలుగులో భారీ ఆఫర్లు వస్తున్నాయి. కాగా, రష్మిక చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  చిన్న పిట్టగోడపై కాలుమీద కాలు వేసుకొని కూర్చున్న ఫోటో అది.  ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్టయిన వెంటనే వైరల్ గా మారింది.