ఈ ఫొటోలో ఉన్న టాప్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఈ ఫొటోలో ఉన్న టాప్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

ప్రతి ఒక్కరు ఎన్నో కలలు కంటారు. ఆ కలల్ని సాకారం చేసుకునేది కొందరే.  ఆ కొందరే మిగతావారికి మార్గదర్శకులు అవుతారు.  వారి స్పూర్తితో మరికొందరు ఆ దిశగా అడుగులు వేస్తుంటారు.  కొందరు కలలు కనడంతో ఆపేస్తారు.  దానికోసం ప్రయత్నం చేయరు.  అందుకే అన్నారు కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు అని.  

ఈ ఉపోద్గాతం అంతా దేనికోసం అని ఆశ్చర్యపోకండి.. మన దర్శకులు అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇందులో ఉన్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం అని దాగుడు మూతలు ఆడుతుంటారు.  అలాగే టాప్ దర్శకుడు ఓ ఫోటోను షేర్ చేశారు.  చిన్నప్పటి ఫోటో అది.  గళ్ళ చొక్కా.. గళ్ళ ప్యాంట్ వేసుకున్నాడు.  మొహంలో అమాయకత్వం కనిపిస్తోంది.  చిన్నప్పుడు అంత అమాయకంగా ఉన్న ఆ పిల్లవాడు .. ఇప్పుడు నా సినిమా నాఇష్టం అనే రీతికి ఎదిగిపోయాడు.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూస పద్దతికి స్వస్తి పలికిన దర్శకుడు ఆయన.  ఇప్పటికైనా అర్ధం అయిందనుకుంటా ఆ ఫొటోలో ఉన్నది ఎవరో.