ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా? 

ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా? 

ఎత్తైన కొండ ... ఆ కొండపై ఓ గుడి... కొండ చుట్టూ పచ్చని పొలాలు... కొండపై క్యాప్ పెట్టుకొని పొలాలవైపు చూస్తున్న ఓ వ్యక్తి.  ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏంటా కథ.. వెనకనుంచి ఫోటో కావడం వలన గుర్తుపట్టలేకపవచ్చు... ఆ హీరో ఎవరో కాదు... సాయి ధరమ్ తేజ్.  చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్... ఇప్పుడు మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. 

ప్రతి రోజు పండుగే సినిమా షూటింగ్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలోని కోరుకొండలో జరుగుతున్నది.  షూటింగ్ మధ్యలో కొద్దిగా గ్యాప్ దొరకడంతో సాయి ధరమ్ తేజ్ ప్రకృతి అందాలను తన మొబైల్ బందిస్తుండగా వెనకనుంచి యూనిట్ ఫోటోలను క్లిక్ మనిపించింది.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు అవి ట్రెండ్ అవుతున్నాయి.  యూవీ క్రియేషన్స్, జీఏ2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  రాఖీఖన్నా హీరోయిన్.