కడుపునొప్పిగా ఉందని హాస్పిటల్ కి వెళ్తే.. డాక్టర్ ఆమెపై... 

కడుపునొప్పిగా ఉందని హాస్పిటల్ కి వెళ్తే.. డాక్టర్ ఆమెపై... 

కడుపునొప్పిగా ఉందని ఇటీవలే ఓ మహిళ హాస్పిటల్ కు వెళ్ళింది.  అయితే, డ్యూటీలో లేడీ డాక్టర్ లేదు.  డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ టెస్ట్ చేస్తానని లోపలికి రమ్మని చెప్పారట.  డాక్టర్ ఘాతుకానికి ఒడికడతాడని తెలియని ఆ మహిళ వైద్యుడి మాటలు నమ్మి లోపలికి వెళ్ళింది.  ఆ సమయంలో పెద్దగా కూడా ఇతర స్టాఫ్ లేకపోవడంతో కడుపునొప్పితో వచ్చిన ఆ మహిళపై అత్యాచారం చేయబోయాడు.  

ఆ ఘటనతో ఉలిక్కిపడ్డ ఆ మహిళ ప్రతిఘటించి పెద్దగా కేకలు వేస్తూ బయటకు వచ్చింది.  మహిళ కేకలు వేయడంతో మిగతా స్టాఫ్ అంతా అక్కడికి వచ్చారు.  జరిగిన విషయం అందరికి చెప్పడంతో ఆ వైద్యుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.  ఈ సంఘటన పాటియాలాలో జరిగింది.