కరోనాతో కోమాలోకి వెళ్లిన ఆ డాక్టర్... కళ్ళు తెరిచే సరికి...
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తుందో చెప్పక్కర్లేదు. కరోనా వైరస్ మనిషి శ్వాస వ్యవస్థపై దాడి చేస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటె మనిషి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. లేదా కోమాలోకి వెళ్లొచ్చు. కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులు సైతం కరోనా బారిన పడి మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలానే లండన్ కు చెందిన ఉకె అనే మహిళ డాక్టర్ ఏప్రిల్ నెలలో కరోనా బారిన పడింది. చికిత్స పొందుతున్న సమయంలో కోమాలోకి వెళ్ళింది. అయితే, అప్పటికే ఆ డాక్టర్ గర్భవతి. కోమాలోకి వెళ్లిన ఆ డాక్టర్ కోలుకోకుంటే కడుపులో ఉన్న బిడ్డలకు ప్రమాదం అని గ్రహించిన వైద్యులు, జులై నెలలో సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. రీసెంట్ గా డాక్టర్ కోమా నుంచి కోలుకుంది. కోమాలోకి వెళ్లే ముందు పొట్ట ఎత్తుగా ఉండటం, కోలుకొని బయటపడిన తరువాత ఆమె పొట్ట మాములుగా ఉండటంతో గర్భస్రావం జరిగిందేమో అని భయపడింది. అయితే, ఆమెకు అసలు విషయం చెప్పి కవల పిల్లలను ఆమెకు చూపించారు. కోమా నుంచి కోలుకున్న ఆ వైద్యురాలు పిల్లలను చూసి సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)