ఆకట్టుకుంటున్న డజ్ సైజ్ మ్యాటర్ పోస్టర్..

ఆకట్టుకుంటున్న డజ్ సైజ్ మ్యాటర్ పోస్టర్..

టాలీవుడ్‌లో ప్రతిరోజు ఏదోఒక కొత్త సినిమా ప్రారంభం అవుతోంది. వీటిలో చాలా వరకు కొత్త నటీనటులతో ప్రారంభం అయ్యే సినిమాలు కూడా చాలానే ఉంటాయి. వాటిలో కొన్ని అద్భుత హిట్లు అందుకుంటే కొన్ని నామమాత్రంగా నిలిచిపోతాయి. అయితే ప్రస్తుతం ఓ పోస్టర్ తెలుగు చిత్ర సిమలో హల్‌చల్ చేస్తుంది. డజ్ సైజ్ మ్యాటర్ అని విడుదల ఈ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై యూవీ కాన్సెప్ట్స్‌ వారు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా పేరు, నటీనటులు ఏ ఒక్క విషయాన్ని ప్రకటించలేదు. పోస్టర్‌లో కూడా ఓ కుర్రాడి చుట్టూ కొలత టేప్ చుట్టుకుని ఉంది, ఆ టేప్ అతడి ముఖాన్ని కూడా కప్పేస్తుంది. ఈ పోస్టర్‌ను గమనిస్తే ఈ సినిమా బోల్డ్ కాన్సెప్ట్‌తో వచ్చేందుకు ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయని సినీ సర్కిల్స్‌లో టాక్ ఉంది. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ మరో రెండు రోజుల్లో విడుదల కానుందని ఈ పోస్టర్ ద్వారా తెలుపుతున్నారు. అప్పుడైనా ఈ సినిమా గురించి మరిన్ని విషయాలను తెలుపుతారేమో వేచి చూడాలి.