సీటు రాకపోవడంతోనే పార్టీ మారుతున్నారు: డొక్కా

సీటు రాకపోవడంతోనే పార్టీ మారుతున్నారు: డొక్కా

పార్టీ మారే వారు సీటు రాకపోవడంతోనే ఇతర పార్టీల వైపు వెళ్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ తెలిపారు. సోమవారం డొక్కా మాణిక్య వర ప్రసాద్ అమరావతిలో మాట్లాడుతూ... ఏపీ ప్రజల భవిష్యత్తుకు టీడీపీ భరోసా ఇస్తుందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మారే వారు సీటు రాకపోవడంతోనే వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వం కావాలన్న ఆలీ.. సీటు దక్కలేదని వైసీపీలో చేరారన్నారు.