డొక్కా సీతమ్మ శిబిరాలు ప్రారంభిస్తున్న పవన్

 డొక్కా సీతమ్మ శిబిరాలు ప్రారంభిస్తున్న పవన్

భవన నిర్మాణ కార్మికులు గత కొంతకాలంగా పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. కూలి చేస్తేనే కడుపు నింపుకునే అవకాశం ఉంటుంది.  ఆ కూలి దొరక్క భవన నిర్మాణ కూలీలు ఇప్పటి వరకు దాదాపుగా 50 మంది వరకు మరణించారు. ఆకలితో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ డొక్కా సీతమ్మ స్పూర్తితో ఈరోజు రేపు తేదీల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేస్తున్నది.  అడ్డా కూలీల దగ్గరకు వెళ్లి ఆహారం అందజేయాలని నిర్ణయించింది. జనసేన కార్యకర్తలు అడ్డా కూలీల దగ్గరికి వెళ్లి ఆహారం అందజేయాలని, అప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి, కనీసం అన్నం లేక ఇబ్బందులు పడుతున్న కూలీలకు ప్రభుత్వం ఆహరం అందిస్తుందేమో చూడాలి. ఇక పవన్ ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఆ లైవ్ చూద్దాం