ట్రంప్ నోటా ఇలాంటి మాటా..? చేతులెత్తేశారా?

ట్రంప్ నోటా ఇలాంటి మాటా..? చేతులెత్తేశారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... తాజాగా చేసిన వ్యాఖ్య‌లు పెద్ద చ‌ర్చ‌గా మారాయి... గ‌త అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఆయ‌న గెల‌వ‌బోడు, లేడు అనే ప్ర‌చారం విస్తృతంగా జ‌రిగినా.. అమెరికా అధ్య‌క్ష పీఠంపై ఆయ‌నే కూర్చుకున్నారు.. ఇక‌, మ‌రోసారి అధ్య‌క్ష ఎన్నిక‌ల‌బ‌రిలో నిలుస్తున్నారు.. ఓవైపు క‌రోనా భ‌య‌పెడుతున్నా.. మ‌రోవైపు ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కూడా ప్రారంభించారు.. కానీ,  ముందస్తుగానే డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారా..?  ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ చూస్తే అవుననే అనిపిస్తోంది. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోబోతున్నట్లు సాక్షాత్తూ ట్రంప్ ప్రకటించాడు. మాట్లాడడం కూడా చేతకాని జో బిడెన్‌ ఈ సారి అమెరికా అధ్యక్షు డు కాబోతున్నాడన్నాడు.. అతడు మంచోడా, కాదా అనేది అనవసరం. కానీ, అలాంటి వ్యక్తి అధ్యక్షుడుగా పనికిరాడు అని స్పష్టం చేశాడు.. నేను ఇప్పటి వరకు అమెరికాకు ఎంతో చేశాను. అయినా, కొందరికి నేను నచ్చడం లేదు'' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్వేదం వ్యక్తం చేశాడు. ఏ విష‌యంలోనైనా నేను ఇంతే అనేలా వ్య‌వ‌హ‌రించే ట్రంప్.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌గా మారింది.