ట్రంప్ కీలక ప్రకటన... భారత్ పర్యటనకు ముందు ఇదేంటి..?

ట్రంప్ కీలక ప్రకటన... భారత్ పర్యటనకు ముందు ఇదేంటి..?

భారత పర్యటనకు ముందు ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ దిగుమతి సుంకం విధించే దేశాల్లో భారత్ ఒకటన్నారు. చాలా ఏళ్లుగా భారత్ అమెరికాను అధిక దిగుమతి సుంకంతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ అంటే తనకు చాలా ఇష్టమని, రెండు దేశాల మధ్య వాణిజ్యబంధంపై చర్చలు జరుపుతామని తెలిపారు. తనకు స్వాగతం చెప్పేందుకు మోడీ భారీ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. 

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా భారత్ వస్తున్నారు. ఈ నెల 24న అమెరికా నుంచి వస్తున్న ఉన్నత స్థాయి బృందంలో ఇవాంకా ట్రంప్‌ కూడా ఉంటారని అధికారిక వర్గాలు ప్రకటించాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ట్రంప్‌తో పాటు ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ పర్యటన మాత్రమే ఖరారయ్యింది. అయితే తాజాగా ఇవాంకా కూడా ట్రంప్‌తో పాటు వస్తున్నారు. 24న అహ్మదాబాద్ చేరుకుని... మొతేరా స్టేడియంను ప్రారంభిస్తారు ట్రంప్. 25 న ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.