డ్రోన్ కలకలం..ప్రమాదం నుండి తప్పించుకున్న ట్రంప్.!

 డ్రోన్ కలకలం..ప్రమాదం నుండి తప్పించుకున్న ట్రంప్.!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెద్ద ప్రమాదం నుండి భయటపడ్డారు. ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్-1 విమానం ఆదివారం రాత్రి వాషింగ్టన్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక డ్రోన్ ఎగురుకుంటూ వచ్చి విమానానికి అత్యంత సమీపంలోనుండి వెళ్ళిపోయింది. డ్రోన్ విమానంకు తాకినట్టుగానే వచ్చి వెళ్లిందని, అది పసుపు,నలుపు రంగులో ఉందని అధికారులు తెలిపారు. విమానం తప్పించుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుంది.