షా గొప్ప ఆటగాడే.. కానీ..

షా గొప్ప ఆటగాడే.. కానీ..

మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లోనే సూపర్‌ సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్‌ పృథ్వీ షాను డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ సెహ్వాగ్‌తో పోల్చడం సరికాదని మాజీ కెప్టెన్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. సెహ్వాగ్‌ చాలా గొప్ప ఆటగాడని.. షాను అతనితో అప్పుడో పొల్చవద్దని సూచించాడు. షా గొప్ప ఆటగాడని.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా టూర్‌లోనూ రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. గంగూలీ కూడా 1996లో ఇంగ్లండ్‌తో అరంగేట్ర మ్యాచ్‌లోనే  సెంచరీ చేశాడు..