పబ్ జీ కి మరో విద్యార్ధి బలి..

 పబ్ జీ కి మరో విద్యార్ధి బలి..

పాపుల‌ర్ మొబైల్ గేమ్ ప్లేయ‌ర్ అన్‌నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్ (PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. పబ్ జీ ఆడి పలువురు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ గేమ్ ను భారత్ లో నిషేదించాలని డిమాండ్లు సైతం వెలువడుతున్నాయి. ఇప్పటికే అనేక మంది పబ్ జీ ఆడి మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా... మరో యువకుడు పబ్ జీ గేమ్ కు బానిసై ప్రాణాలను తీసుకున్నాడు. నిజామాబాద్ లో 9వ తరగతి చదువుతున్న శ్రేయస్ అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి పబ్ జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించడంతో కోపంగా గదిలోకి వెళ్లిన శ్రేయస్ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు.