జరిమానా కోరుకోలేదు: ధోని

జరిమానా కోరుకోలేదు: ధోని

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జరిమానా పడాలని కోరుకోవట్లేదు అని తెలిపారు. ఆసియా కప్ సూపర్ ఫోర్ లో భాగంగా మంగళవారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైరింగ్  తప్పిదాలతో కెప్టెన్ ధోనీ, దినేశ్ కార్తీక్ లు పెవిలియన్ చేరారు. ఫీల్డ్ అంపైర్లు గ్రెగరీ బ్రాత్‌వైట్, అనీసుర్ రెహమన్ తప్పుడు నిర్ణయాలకు ఈ ఇద్దరు బలయ్యారు. ధోనీ అవుట్ అయిన సమయంలో భారత్ కు రివ్యూ అవకాశం లేకపోవడంతో ధోనీ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ధోనీ పార్ట్ టైం స్పిన్నర్ జావేద్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. అయితే బంతి వికెట్లకు తాకకుండా లెగ్‌సైడ్ దిశగా వెళుతున్నట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించింది. కార్తీక్ స్పిన్నర్ నబీకి ఎల్బిడబ్ల్యూ గా చిక్కాడు. ఇది కూడా లెగ్ స్టంప్ కి దూరంగా వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. ఫీల్డ్ అంపైరింగ్ తప్పిదాలతో కీలక వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను టై గా ముగించింది భారత్. 

మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో ధోనీ మాట్లాడుతూ... 'నేను ఎలాంటి జరిమానా ఎదుర్కొదల్చుకోలేదు. ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలను వ్యతిరేకించి ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించలేను అని అన్నాడు. ఆఫ్ఘన్ క్రికెట్ చాలా అభివృద్ధి చెందింది. ఆసియా కప్ మొదటి నుండి అద్భుతంగా రాణిస్తున్నారు. పెద్ద జట్లకు సరైన పోటినిచ్చే స్థాయికి ఎదిగారు. భారత్ తో మ్యాచ్‌లో వాళ్లు అన్ని  విభాగాల్లో ఆకట్టుకున్నారు. రాహుల్, రాయుడు ఆరంభమిచ్చినా.. మేము సద్వినియోగపరచుకోలేదు. పిచ్ స్లోగా మారడంతో బ్యాటింగ్ చేయడం కష్టమైంది' అని ధోనీ అన్నాడు. 

'నేను చాలా సంతోషంగా లేను.. 6 గంటలు గ్రౌండ్ లో కష్టపడ్డా ఫలితం దక్కలేదు. కానీ జట్టు ప్రదర్శనపై సంతోషంగా ఉన్నా. నేను ఇక ఫైనల్ గురించి ఆలోచిస్తున్నా. ఫైనల్లో నా ఆటను ఫ్రీగా ఆడాలనుకుంటున్నా. నేను గర్వపడుతున్నాను, ఎందుకంటే ఆసియాలో అత్యుత్తమ జట్టుకు వ్యతిరేకంగా నేను ఈ ఇన్నింగ్స్ ఆడాడు. నేను టోర్నమెంట్ అంతటా బాగా ఆడలేదు, కానీ నేను ఈ విషయంలో సంతోషంగా ఉన్నాను' అని ధోనీ అన్నాడు.