మూడేళ్లు.. 42 వెర్షన్లు.. ఫలితం మరికాసేపట్లో...

మూడేళ్లు.. 42 వెర్షన్లు.. ఫలితం మరికాసేపట్లో...

ఏదైనా ఒక సినిమాకు కథ అనుకున్నాకా దానిని స్క్రిప్ట్ రా మలుచుకొని అంతా సిద్దమా చేసుకోవానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది.  ఒక స్క్రిప్ట్ అనుకున్నా ఎందుకైనా మంచిది అని రెండు మూడు స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటారు.  కానీ, మూడేళ్ళ పాటు కష్టపడి ఒక సినిమా కోసం 42 వెర్షన్లు రాయడం అంటే మామూలు విషయం కాదు.  

మూడేళ్లు కష్టపడి దొరసాని సినిమా కోసం దర్శకుడు కెవిఆర్ మహేంద్ర 42 వెర్షన్లు రాసుకున్నాడట.  ఫైనల్ గా ఒక వెర్షన్ స్క్రిప్ట్ ను రెడీ చేసుకొని సినిమాగా తీసినట్టు చెప్పాడు.  నిజాం కాలం నాటి ప్రేమ కథతో సినిమా తెరకెక్కింది.  రాజు అనే అబ్బాయి, దొరసాని మధ్య అందమైన ప్రేమ కథ ఎలా నడిచింది అన్నది కథ.  ప్రేమకథ చాలా ఫ్రెష్ గా ఉంటుంది.  సినిమా చూశాక అందరికి అర్ధం అవుతుందనని అంటున్నాడు మహేంద్ర.