'దోస్త్' నోటిఫికేషన్ వాయిదా పడింది

 'దోస్త్' నోటిఫికేషన్ వాయిదా పడింది

తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల నోటిఫికేషన్ వాయిదా పడింది. బుధవారం నోటిఫికేషన్ జారీ చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ.. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు ఈ నెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. దోస్త్ కమిటీ ఇవాళ మరోసారి సమావేశమైంది. నోటిఫికేషన్ వాయిదా వేసి.. ఈ నెల 22న జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.