ఎన్టీఆర్ పుట్టినరోజున డబల్ సర్ప్రైజ్ ఇస్తున్నారా?

ఎన్టీఆర్ పుట్టినరోజున డబల్ సర్ప్రైజ్ ఇస్తున్నారా?

రామ్ చరణ్ పుట్టినరోజున ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఓ సర్ప్రైజ్ ను ఇచ్చారు.  ఈ సర్ప్రైజ్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యింది.  ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో వచ్చిన వీడియో సోషల్ మీడియాను కుదిపేసింది.  అయితే, ఈ సర్ప్రైజ్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం లాక్ డౌన్ కు ముందు జరిగిపోవడంతో దీనిని రిలీజ్ చేయగలిగారు.  

అయితే, ఇప్పుడు ఇండియాలో లాక్ డౌన్ జరుగుతున్నది.  అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు.  ఆరోజున రామ్ చరణ్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో కొమరం భీం ఇంట్రో ఉంటుంది.  కానీ, దానికి సంబంధించిన వీడియో షూటింగ్ చేయలేదని తెలుస్తోంది.  ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ సినిమా నుంచి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారో తెలియాలి.  తప్పకుండా ఏదో ఒకటి మాత్రం ఉంటుంది.  ఇకపోతే, అదే రోజున ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారట.  త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.