తొలి ట్వీట్ ఖరీదెంతో తెలుసా? 

తొలి ట్వీట్ ఖరీదెంతో తెలుసా? 

2006 మార్చి 21 వ తేదీన ట్విట్టర్ ఆవిష్కరణ జరిగింది.  ఆ రోజున ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సీ తొలి ట్వీట్ చేశారు.  జస్ట్ సెట్టింగ్ ఆఫ్ మై ట్విట్టర్ అంటూ ట్వీట్ చేశారు.  జాక్ డోర్సీ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తొలి ట్వీట్ చేసిన తరువాత ట్విట్టర్ ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి చెందిందో, ఒక్క రోజులో ఎన్ని ట్వీట్స్ చేస్తున్నారో అందరికి తెలుసు. ఒక్కో ట్వీట్ కు ఇప్పుడు ఎంతో విలువ ఉన్నది.  మార్చి 21, 2006న చేసిన ట్వీట్ ను ఇప్పుడు వ్యాల్యుబుల్స్ బై సెంట్ అనే వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టారు.  అనూహ్యంగా ఈ ట్వీట్ 2.5 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 18.30 కోట్లు.