అగ్ని ప్రమాదం మీద స్పందించిన డాక్టర్ రమేష్ !

అగ్ని ప్రమాదం మీద స్పందించిన డాక్టర్ రమేష్ !


క్వారంటైన్ సెంటర్లో జరిగిన సంఘటనలో పది మంది మరణించడం దురదృష్టకరమని రమేష్ హాస్పటల్ ఛైర్మన్ డాక్టర్ రమేష్ బాబు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక, పోలీసు, ఇతర అధికారులు స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మా ఆసుపత్రి నుంచి టెలి మెడిసిన్ ద్వారా హోం క్వారంటైన్ లో ఉన్న వారికి చికిత్స అందించామని అయితే కలెక్టర్, డీఎం.హెచ్.ఓలు ఇన్ పేషెంట్లను చేర్చుకునేందుకు సిద్దం కావాలని సమావేశంలో చెప్పారని అన్నారు. రోగులు పెరుగుతుండటంతో, తమ పేషెంట్లకు కూడా కరోనా సోకడంతో క్వారంటైన్ సెంటర్ నడిపేందుకు అనుమతి కావాలని కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

అనుమతి ఇచ్చిన తర్వాత రెండు హోటల్స్ లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. హోటల్ యాజమాన్యానికి, మాకు మధ్య ఒప్పందం ఉందన్న ఆయన హోటల్ నిర్వహణను, ఇతర సౌకర్యాలను హోటల్ యాజమాన్యం చూసుకుంటుందని, తాము కోవిడ్ పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని మాత్రమే చూసుకుంటామని ఆయన అన్నారు. 200 మందికి పైగా పేషెంట్లు క్వారంటైన్ సెంటర్లో చికిత్స పొందారని వీరికి ట్రీట్ మెంట్ ఇచ్చే సిబ్బందికి మేము తగిన శిక్షణ ఇచ్చామని ఆయన అన్నారు. చికిత్స ఎలా చేయాలి, క్వారంటైన్ సెంటర్ నుంచి ఆసుపత్రికి ఎప్పుడు తరలించాలి, ఎప్పుడు డిశ్చార్జి చేయాలి అనే అంశాలపై మేము శిక్షణ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.