ప్రియాంక మర్డర్ కేసు...అత్యాచారం చేసి చంపిన ఆ నలుగురు !

ప్రియాంక మర్డర్ కేసు...అత్యాచారం చేసి చంపిన ఆ నలుగురు !

ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక రెడ్డి స్కూటీని ఉద్దేశపూర్వకంగానే పంచర్ చేసిన నలుగురు దుండగులు, ఆ తర్వాత స్కూటీ పంచర్ పేరుతో డ్రామాలు ఆడారాని చెబుతున్నారు. బండి అక్కడ పెట్టగానే పంక్చర్ చేసి గచ్చిబౌలి నుంచి ప్రియాంక రెడ్డి రాగానే పంచర్ వెయిస్తామని అంటూ వారు కాస్త డ్రామా ప్లే చేసినట్టు చెబుతున్నారు. ప్రియాంక రెడ్డిని మాటల్లో పెట్టిన వారిలో ఒకరు ఆ బండిని పంక్చర్ వేయిస్తానని వెళ్ళగా మిగతా వారు  ప్రియాంక కిడ్నాప్ చేసి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో రేప్ చేసి హత్య చేసినట్టు భావిస్తున్నారు. సిటీలోకి రాత్రి సమయంలో లారీలు నో ఎంట్రీ కావడంతో టోల్ ప్లాజా వద్ద ఆ లారీ డ్రైవర్లు ఆగారని చెబుతున్నారు.