ద్రవిడ్‌ అవునన్నా.. రవిశాస్త్రి కాదన్నాడు..!

ద్రవిడ్‌ అవునన్నా.. రవిశాస్త్రి కాదన్నాడు..!

ఇంగ్లండ్‌లో టీమిండియా పేలవ ప్రదర్శనతో కోచ్‌ రవిశాస్త్రిపై మాజీలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కోచ్‌గా రవిశాస్త్రి పూర్తిగా విఫలమయ్యాడని సునీల్‌ గవాస్కర్‌ వ్యాఖ్యానించగా.. ఇప్పుడు మరో రహస్యాన్ని సౌరవ్‌ గంగూలీ బయటపెట్టాడు. సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలోని క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ).. విదేశీ పర్యటనల్లో టీమిండియా బ్యాటింగ్‌ సలహాదారుగా ద్రవిడ్‌ను, బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ఖాన్‌ను నాడు ఎంపిక చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో సౌరవ్‌ వివరించారు. 
'కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసినప్పుడే రాహుల్‌ ద్రవిడ్‌ను విదేశాల్లో టీమిండియా బ్యాటింగ్‌ సలహాదారుగా ఎంపిక చేశాం. అతను అంగీకరించాడు. ఆ తర్వాత ద్రవిడ్‌.. రవిశాస్త్రితో మాట్లాడాడు. ఈ భేటీ తర్వతా రాహుల్‌ మనసు మార్చుకున్నాడు' అంటూ బాంబు పేల్చేడు.  ఏడాది కిందట అనిల్‌ కుంబ్లే స్థానంలో అత్యంత వివాదాస్పద రీతిలో కోచ్‌గా రవిశాస్త్రి నియమితుడయ్యాడు. ద్రవిడ్‌, జహీర్‌ఖాన్‌ను కాదని.. తన సహాయ సిబ్బందిని ఎంచుకున్న తీరుపైనా అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.