లాక్ డౌన్ ఎఫెక్ట్: రోడ్లపై పండ్లు అమ్ముతున్న సినీ నటుడు... కారణం ఇదే...!!

లాక్ డౌన్ ఎఫెక్ట్: రోడ్లపై పండ్లు అమ్ముతున్న సినీ నటుడు... కారణం ఇదే...!!

కరోనా వైరస్ ప్రజల జీవనాన్ని, జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  మేకప్ వేసుకొని సినిమాల్లో నటిస్తూ హీరోగా తిరిగిన వ్యక్తులు ఇప్పుడు రోడ్డుమీద పడాల్సిన పరిస్థితులు వచ్చాయి.  మొన్నటి రోజున కన్న కలలు చచ్చిపోయినపుడు జీవితం చెత్తగా ఉంటుందని చెప్పి పాడ్ మ్యాన్ నటి ప్రేక్ష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.  ఒక్క ప్రేక్ష మాత్రమే కాదు చాలామంది సినిమా వాళ్లకు రియల్ గా సినిమా కష్టాలు తీసుకొచ్చింది.  

సినిమాల్లో అవకాశాలు వస్తే జీవితం హాయిగా ఉంటుంది.  సినిమా రంగంలో రాణిస్తే కాలుమీద కాలేసుకుని జీవించ వచ్చు.  కానీ, అదే జీవితం తలకిందులైతే రోడ్డుపై పండ్లు అమ్ముకుంటూ పొట్టపోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.  ఇదిగో ఈ సోలంకి దివాకర్ లా మారాల్సి వస్తుంది.  డ్రీమ్ గర్ల్ సినిమాలో సోలంకి దివాకర్ మంచి పాత్ర చేసి పేరు తెచ్చుకున్నాడు.  మరి కొన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.  కానీ, లాక్ డౌన్ కారణంగా సినిమాలు నిలిచిపోయి.  కుటుంబ పోషణ కష్టం అయ్యింది.  ఆకలి ఎలాంటి పనినైనా చేయిస్తుంది కదా అందుకే మొహమాట పడకుండా తోపుడు బండిపై మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  అంతేకాదు, తనకు చేతనైన సహాయం చేస్తున్నాడు.  ఇంకా కొన్నాళ్ళు ఇలానే లాక్ డౌన్ కొనసాగితే కోట్లాది మంది జీవితాలు ఇలానే రోడ్డున పడే అవకాశం ఉన్నది.