హైదరాబాద్ లో కోట్ల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్ లో కోట్ల విలువైన  గంజాయి పట్టివేత

హైదరాబాద్ నగర శివారులో భారీగా గంజాయి పట్టుబడింది. కొబ్బరి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 944 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. దీని విలువ మార్కెట్లో సుమారు 1.8 కోట్ల రూపాయలు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. కొబ్బరి కాయల లోడ్‌ ముసుగులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందిన మేరకు డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలడంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.