రోడ్డు పై  ఉమ్మువేసినందుకు కేసు బుక్ చేసిన పోలీసులు...

రోడ్డు పై  ఉమ్మువేసినందుకు కేసు బుక్ చేసిన పోలీసులు...

కరోనా ప్రభావం భారత్ పై రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాయి .. లాక్ డౌన్  పేరుతో ప్రభుత్వాలు ప్రజలను హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం కోవిడ్ 19 మహమ్మారి ప్రబలుతోంది. ఈ సమయంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి. అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలి. వాటి వల్ల వైరస్, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం... ఈ క్రమంలోనే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తామని... అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించింది.

తాజాగా హైదరాబాద్ లో రోడ్డు పై ఉమ్ము వేసినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరూర్ నగర్  చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు పై ఉమ్మినందుకు అబ్దుల్ ముజేద్  అనే వ్యక్తి పై  కేసు నమోదు చేసారు పోలీసులు.  రోడ్డు పై వాహనం పై ఉమ్మి వేసి పోలీసులకు అడ్డంగాదొరికిపోయాడు ముజేద్. సెక్షన్ 274, 269 ఐపీసీ కింద పోలీసుకు కేసు నమోదు చేసారు.