ద్రోణవలి హారిక పెళ్లి తేదీ ఖరారు..

ద్రోణవలి హారిక పెళ్లి తేదీ ఖరారు..

ప్రముఖ చందరంగ క్రీడాకారిణి గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవలి హారిక పెళ్లి కూతురు కాబోతోంది. సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన కార్తిక్‌చంద్రను ఆమె వివాహం చేసుకోనుంది. ఈ నెల 18న హైదరాబాద్‌లో వీరి నిశ్చితార్థం, ఆగస్టు 19న వివాహం జరగనుంది.  
 2008లో జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన హారిక... 2011లో గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించింది. 2012, 2015, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించింది. కామన్వెల్త్, ఆసియా చాంపియన్‌గా కూడా నిలిచి చరిత్ర సృష్టించింది.