బాబు నివాసం వద్ద డ్రోన్ కలకలం..!!

బాబు నివాసం వద్ద డ్రోన్ కలకలం..!!

చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ డ్రోన్ కలకలం రేగింది.  తన ఇంటిపై డ్రోన్ తో నిఘా పెట్టడాన్ని చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు.  వెంటనే ఏపి డీజీపీ ఫోన్ చేసి మాట్లాడారు.  హైసెక్యూరిటీ జోన్‌లో డ్రోన్లు ఎగరడంపై అధికారులను నిలదీశారు. డ్రోన్లు ఎగరేస్తున్న వ్యక్తులెవరు?వారికి అనుమతులు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా డ్రోన్లు ఎగురవేయడానికి వీల్లేదు కదా? అని అన్నారు. అన్ని అనుమతులతోనే డ్రోన్లు ఎగరేస్తున్నారా అని ప్రశ్నించారు.

బాబు ప్రశ్నలపై ఇరిగేషన్ శాఖ సమాధానం ఇచ్చింది.  వరద ఉదృతిని తెలుసుకోవడం కోసమే డ్రోన్ తో వీడియో తీసినట్టు పేర్కొన్నది.  ఎగువ నుంచి వరద అధికంగా వస్తుండటంతో.. ముందు జాగ్రత్తగా కోసం ఇలా వీడియో తీయాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చింది.  అయితే, తెలుగుదేశం పార్టీ నేతలు దీనిపై సీరియస్ అవుతున్నారు.  చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని పోలీసులను నిలదీస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.