హైదరాబాద్‌లో భారీగా కొకైన్, హెరాయిన్ స్వాధీనం..

హైదరాబాద్‌లో భారీగా కొకైన్, హెరాయిన్ స్వాధీనం..

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం రేపుతోంది... అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు... డ్రగ్స్ సరఫరా చేస్తోన్న నలుగురిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర కోటి రూపాయల విలువ చేసే కొకైన్, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి కొకైన్, హెరాయిన్ తెచ్చి హైదరాబాద్‌, రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రముఖులకు విక్రస్తున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.