తాగి నడుపుతూ దొరికేసిన ప్రైవేటు బస్సు డ్రైవర్లు

తాగి నడుపుతూ దొరికేసిన ప్రైవేటు బస్సు డ్రైవర్లు

ప్రైవేటు ట్రావెల్స్‌ డ్రైవర్లు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుల్‌గా తాగి డ్రైవింగ్‌ చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికర్ల వద్ద నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు విస్తుపోయే ఫలితాలొచ్చాయి. కొందరు డ్రైవర్లు పీకల దాకా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తున్నారని నిర్ధారణ కావడంతో వెంకట పద్మావతి ట్రావెల్స్, జీవీఆర్ ట్రావెల్స్, కనకదుర్గ ట్రావెల్స్ డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.